సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటని సీఎం అన్నారు. పత్రికా సంపాదకుడుగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్ పోషించిన పాత్రను, వారి సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే.. ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో జరిగిన తొక్కిసలాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ (62) కన్నుమూశారు.
Also Read : Annie: హీరోయిన్ గా రాజన్న చైల్డ్ ఆర్టిస్ట్.. రిలీజ్ కి రెడీ అవుతున్న ‘తికమక తాండ’
తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన జహీరుద్దీన్‌కు గుండెపోటు రావడంతో.. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే అలీఖాన్ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, సోమవారం రాత్రి అల్వాల్‌లోని మహాబోధి స్కూల్‌లో అంత్యక్రియలు జరిగాయి. గద్దర్ ఇంటి నుంచి ఆయన పార్థీవదేహాన్ని స్కూల్‌కు తీసుకొచ్చారు. ఈ అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. వేలాది మంది తోసుకుంటూ రావడంతో అక్కడేవున్న అలీఖాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు తోపులాటను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read : Ajith: గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో.. మరీ ఇంత దారుణంగానా.. ?
