NTV Telugu Site icon

MLA G Sayanna : ఎమ్మెల్యే సాయన్న మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం

Cm Kcr

Cm Kcr

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి. సాయన్న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్నను ఇవాళ ఉదయం షుగర్‌ లెవెల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయన్న తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా సాయన్న కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా సాయన్న గెలిచారు. టీడీపీ తరుఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా సాయన్న గెలుపొందారు. రెండుసార్లు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. సాయన్న మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న.. చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను.. తనతో వారికున్న అనుబంధాన్ని, సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నిరంతరం శ్రమించే నాయకుడు : మంత్రి కేటీఆర్‌..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న మృతి బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే గొప్ప నాయకుడు సాయన్న. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరం : ఈటల

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నానన్నారు.

సాయన్న అందరితోనూ సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవారు : కిషన్‌ రెడ్డి

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. సాయన్న గారు అందరితోనూ సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవారన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరం : మంత్రి గంగుల

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని పేర్కొన్నారు.