NTV Telugu Site icon

CM KCR : ధరణి వద్దంటున్న కాంగ్రెస్ నేతలను బంగాళాఖాతంలో కలపాలి

Kcr

Kcr

ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బోల్లం మల్లయ్య యాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను ఆంధ్రలో కలిపిన వాళ్ళే కాంగ్రెస్ వాళ్లు అని, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మణంలో అన్యాయం జరిగింది.. ఆ పాపం కాంగ్రెస్ పార్టీదేనన్నారు. 9 ఏళ్లలో సాగర్ నుంచి కావాల్సిన సాగునీటిని విడుదల చేసుకున్నామన్నారు సీఎం కేసీఆర్‌. సాగర్ నుండి సాగు నీటి కోసం, విద్యుత్ కోసం కాంగ్రెస్ నేతలు ఏనాడూ కొట్లడలేదని, నిండు సభలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మనలను అవమానిస్తే… సభలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరెందుకు విప్పలేదన్నారు. కాంగ్రెస్ లో డజన్ మంది ముఖ్యమOత్రులు ఉన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. రైతుబందు కావాలంన్నా, 24 గంటల విద్యుత్ కావాలన్నా BRS కు ఓటెయ్యాలని, రాహుల్ గాంధీకి వ్యవసాయం తెలియదని, ధరణి వద్దంటున్న కాంగ్రెస్ నేతలను బంగాళా ఖాతంలో కలపాలన్నారు సీఎం కేసీఆర్‌.

Also Read : Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు చెప్పుకోవటానికి కూడా న్యూసెన్స్‌గా ఉండే వ్యాధులు.. అందుకే మధ్యంతర బెయిల్‌..!

కరెంట్ మూడు గంటలు చాలు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. అసలు వ్యవసాయం చేస్తే కదా ఎన్ని గంటలు కరెంట్ ఉండాలో తెలిసేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ధరణి తీసేస్తా అని రాహుల్, రేవంత్, భట్టి విక్రమార్క అంటున్నారు.. ధరణి తీసేస్తే వీఆర్వో లాంటి వ్యవస్థలు మళ్లీ వస్తాయని అన్నారు. రైతుబంధు పదహారు వేలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పింఛన్లు ఐదు వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం అందిస్తామని వెల్లడించారు. ప్రతీ ఇంటికి బీఆర్ఎస్ మేనిఫేస్టో తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Also Read AP Government: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌.. లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ప్రభుత్వం..