NTV Telugu Site icon

CM KCR : మునుగోడులో గోల్‌మాల్‌ ఉప ఎన్నిక వచ్చింది

Kcr At Munugodu

Kcr At Munugodu

CM KCR Adressed At Munugodu Praja divena Sabha

ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. దీంతో.. రాష్ట్ర రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో నేడు మునుగోడు ప్రజా దీవెన పేరుతో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మంచినీళ్లు తెచ్చుకున్నం.. కొంత బాధ పోయింది. ఇక.. సాగు నీళ్లు రావాలంటే.. నల్లగొండ ఉండేదే కృష్ణ బేసిన్‌లో.. అయితే.. డిండి ద్వారా రావాలే.. అలా రావాలంటే.. శివన్నగూడెం ప్రాజెక్ట్‌ ద్వారా రావాలే.. శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి తీసుకొని లిఫ్ట్‌ ద్వారా నింపుకోవాలే. దాని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాం. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు. మనం చేతుల్లో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పజెప్పి.. ఎవరినో పోరాటం చేయమంటే చేయరు. ప్రజలు సీరియస్‌గా ఆలోచించాలి. ప్రజలు దగ్గర ఉండే ఒకే ఆయుధం ఓటు.

CM KCR : ఒకనాడు ఫ్లొరైడ్‌ నీళ్లతోని, నడుములు వంగిపోయి.. ఇవాళ్ల జీరో ఫ్లొరైడ్‌

 

దాని ద్వారా నిర్మాణమయ్యే శక్తి మనకు ఉపయోగపడుతదా.. పడదా.. ఆలోచించి ఓటు వేయాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలి. ఆ చర్చలో భాగంగానే ఈ రోజు దేశంలో జరిగేటువంటి వ్యవహారాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు, సమాజాన్ని చీల్చి చెండాడే విద్వేష విధానాలకు పోరాటం జరుగవలసిని అవసరం ఉందని.. జాతీయ, రాష్ట్ర స్థాయి కమ్యూనిస్టు, ఇతర పార్టీ నాయకులతో నేను చర్చలు జరుపుతున్నా. ఈ దేశాన్ని ప్రజలను ఏవిధంగా కాపాడుకోవాలని ఐదారు నెలలుగా ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఏవిధంగా మునుగోడులో గోల్‌మాల్ ఉప ఎన్నిక వచ్చిందో మీకు తెలుసు. ఏం అవసరం ఉండి వచ్చింది ఎన్నిక ఇక్కడా..? ఇంకో సంవత్సరం అయితే ఎన్నికలే ఉండే.. ఇప్పుడు ఈ ఎన్నిక తీసుకువచ్చి ఎవ్వరిని ఉద్ధరించడానికి..? ఎవరి సంక్షేమం కోరి.. ఎవరి మంచి కోరి.. ఈ ఉప ఎన్నిక తీసుకువచ్చారు. ఈ ఉప ఎన్నిక వెనుకున్న మాయ మచ్చీంద్ర గుర్తు పట్టకపోతే.. దెబ్బతినే ప్రమాదం ఉంది’ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.