NTV Telugu Site icon

CM KCR : తెలంగాణలో గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి

Cm Kcr

Cm Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సోమవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామానికి చేరుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా తుమ్మలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం తుమ్మలూరులో కార్యక్రమంలో భాగంగా మహా గని మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ కొద్దిగా ప‌చ్చబ‌డిందని, 8 ఏండ్ల నుంచి ప‌ట్టుబ‌ట్టి జ‌ట్టుక‌ట్టి బీడు వారిన తెలంగాణ‌ను ఒక తొవ్వకు తెచ్చుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. వ‌డ్లు పండించ‌డంలో 2014లో మ‌నం 15, 16వ స్థానంలో ఉన్నామని, ఇవాళ దేశంలో అతి ఎక్కువ వ‌డ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ అని ప‌త్రిక‌ల్లో వ‌చ్చిందని ఆయన వెల్లడించారు. మ‌న‌కు భూమి, నీళ్లు, అడ‌వులు ఉన్నాయన్న సీఎం కేసీఆర్‌.. విస్తృతంగా చెట్లు పెంచితే అపార‌మైన ఆక్సిజ‌న్ ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. అద్భుత‌మైన అవ‌కాశం ఉన్న దేశంలో అడ‌వుల‌ను నాశ‌నం చేశారని ఆయన మండిపడ్డారు. హ‌రిత‌హారం అనే చెబితే చాలా మందికి అర్థం కాలేదని, హాస్యాస్ప‌దం చేశారని గుర్తు చేశారు. కొంత‌మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భ‌లో జోకులు వేశారని ఆయన అన్నారు.

Also Read : Bhatti Vikramarka : దొరల ప్రభుత్వం వద్దు ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందాం

‘100 శాతం ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకువ‌స్తాను అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కృష్ణా న‌దిలో నీళ్ల కోసం పంచాయ‌తీ ఉంద‌ని కేసీఆర్ అన్నారు. గోదావ‌రిలో నీళ్ల పంచాయ‌తీ లేదు. గండిపేట‌, హిమాయ‌త్ సాగ‌ర్ వ‌ర‌కు గోదావ‌రి లింక్ అయిపోతుంది. అక్క‌డ్నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా కూడా నీళ్లు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఏదో ఒక ప‌ద్ధ‌తిలో ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చి ఇస్తాను. చింత చేయాల్సిన అవ‌స‌రం లేదు అని కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ ఏర్ప‌డిన కొత్త‌లో భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితి ఉండే అని కేసీఆర్ గుర్తు చేశారు. నీళ్లు లేక ఇబ్బంది ప‌డ్డాం. త‌ద్వారా చెట్ల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించాం. వానలు వాప‌స్ రావాలె.. కోతులు వాప‌స్ పోవాలె అని నేనే పాట రాశాను. ప‌చ్చ‌ద‌నం ఉంటేనే వ‌ర్షాలు వ‌స్తాయి. చెట్లు నాట‌డం ఏంద‌ని చాలా మంది న‌వ్వారు. కేసీఆర్ ప్రారంభించిన కార్య‌క్ర‌మంతో తెలంగాణ‌లో ప‌చ్చ‌ద‌నం పెరిగింది. నాశ‌మైన అడ‌వుల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని నిర్ణ‌యించాం. అడ‌వుల‌ను పెంపొందించేందుకు హ‌రిత సైనికుల్లాగా ప్రియాంక వ‌ర్గీస్, భూపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. రిజ‌ర్వ్ ఫారెస్టును బ్ర‌హ్మాండంగా పెంచుకున్నాం.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

Also Read : Karnataka: కర్ణాటకలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు.. 26మంది ఆఫ్రికన్ మహిళలు అరెస్ట్