CM KCR : మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏసు క్రీస్తు శిలువ వేయబడిన రోజు, ‘గుడ్ ఫ్రైడే’ ( ఏప్రిల్ 7) సందర్భంగా ప్రజలకోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. శిలువ మీద తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించుమని భగవంతున్ని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు అని సిఎం పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే’ క్రైస్తవులకు పరమ పవిత్రమైన రోజని సీఎం అన్నారు. సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సాహాయుల పట్ల జాలి, అవధులు లేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను కలిగివుండడం కరుణామయుడైన ఏసుక్రీస్తుకే సాధ్యమైందని సిఎం అన్నారు.
Also Read : CM Jagan Humanity: మనవత్వం చాటుకున్న సీఎం జగన్.. ఐదుగురికి తక్షణ సాయం..
Also Read
ఈ లక్షణాలను ప్రతి ఒక్కరూ పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం వున్నదన్నారు. మానవజాతికి శాంతి సహనం అహింస సౌభ్రాతృత్వాలను క్రీస్తు తన ఆచరణ ద్వారా సమస్త మానవాళికి సందేశంగా ఇచ్చాడని సీఎం కేసీఆర్ తెలిపారు. విభేదాలు తారతమ్యాలు లేకుండా మనుషులంతా వొక్కటిగా కలిసి వుండేందుకు ఏసుక్రీస్తు బోధనలు ఎంతగానో దోహదం చేస్తాయని సిఎం అన్నారు. గుడ్ ఫ్రైడే ను ప్రజలు దైవ ప్రార్థనలతో జరుపుకోవాలనీ, ప్రజల మధ్య శాంతి, సామరస్యం విలసిల్లాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
Also Read : KKR vs RCB: దంచికొట్టిన కేకేఆర్.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!