Site icon NTV Telugu

CM KCR : మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు

Cm Kcr

Cm Kcr

ఏసు క్రీస్తు శిలువ వేయబడిన రోజు, ‘గుడ్ ఫ్రైడే’ ( ఏప్రిల్ 7) సందర్భంగా ప్రజలకోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. శిలువ మీద తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించుమని భగవంతున్ని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు అని సిఎం పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే’ క్రైస్తవులకు పరమ పవిత్రమైన రోజని సీఎం అన్నారు. సమస్త మాన‌వాళి ప‌ట్ల ప్రేమ‌, నిస్సాహాయుల ప‌ట్ల జాలి, అవ‌ధులు లేని త్యాగం, సడలని ఓర్పు, శ‌త్రువుల ప‌ట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను కలిగివుండడం కరుణామయుడైన ఏసుక్రీస్తుకే సాధ్యమైందని సిఎం అన్నారు.

Also Read : CM Jagan Humanity: మనవత్వం చాటుకున్న సీఎం జగన్.. ఐదుగురికి తక్షణ సాయం..

ఈ లక్షణాలను ప్రతి ఒక్కరూ పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం వున్నదన్నారు. మానవజాతికి శాంతి సహనం అహింస సౌభ్రాతృత్వాలను క్రీస్తు తన ఆచరణ ద్వారా సమస్త మానవాళికి సందేశంగా ఇచ్చాడని సీఎం కేసీఆర్ తెలిపారు. విభేదాలు తారతమ్యాలు లేకుండా మనుషులంతా వొక్కటిగా కలిసి వుండేందుకు ఏసుక్రీస్తు బోధనలు ఎంతగానో దోహదం చేస్తాయని సిఎం అన్నారు. గుడ్ ఫ్రైడే ను ప్రజలు దైవ ప్రార్థనలతో జరుపుకోవాలనీ, ప్రజల మధ్య శాంతి, సామరస్యం విలసిల్లాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

Also Read : KKR vs RCB: దంచికొట్టిన కేకేఆర్.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం

Exit mobile version