తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం నేడు జరిగింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అయితే.. ఈ సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల ప్రసక్తేలేదు.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగాయని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ఈడీ దాడులను పార్టీ నేతలు ఉపేక్షించవద్దని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎక్కడ కేంద్ర సంస్థలు దాడులు చేస్తే అక్కడ ధర్నాలు చేయండని కేసీఆర్ సూచించారు. అయితే.. ఎన్నికలకు పది నెలలే ఉన్నాయని, ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని, పాతవారికే టికెట్లు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయని, బీజేపీతో పోరాడాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Tribute To Krishna: సినీ ప్రేక్షకులకు గమనిక.. రేపు విజయవాడలో సినిమా షోలు క్యాన్సిల్
అంతేకాకుండా.. నా కూతురు కవితను కూడా పార్టీ మారమని అడిగారని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసే ప్రధాన ఉద్దేశంతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిసి సమన్వయంగా పని చేసేలా నియోజవకవర్గానికి ఓ ఇంఛార్జీని నియమించనున్నట్లు సమాచారం.
