రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు చెందిన వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్–2022 సీజన్‌లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు సీఎం జగన్.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు చేశామన్నారు. పంట రుణాలు ఏడాదిలో తీర్చిన రైతులకు పూర్తి వడ్డీ రాయితీ ఉంటుందన్నారు.
Also Read : Minister RK Roja : రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారు
గతంలో వైఎస్సార్ రైతుల భరోసా లాంటి పథకం లేదని, చంద్రబాబు సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టారని ఆయన విమర్శించారు. చంద్రబాబు రుణ మాఫీ కోసం రూ.15 వేల కోట్లే ఇచ్చారని సీఎం జగన్ అన్నారు. పంట కొనుగోలు సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా ఆర్బీకేలు పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో ఒక్క కరువు మండలం డిక్లేర్ చేసే పరిస్థితి లేదన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలో కొత్త ఒరవడి తీసుకువచ్చిందని, రూ.1,834 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. రబీ 2020–21 సీజన్‌లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, ఖరీఫ్–2021 సీజన్‌లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.115.33 కోట్లు జమ చేశారు. అదే విధంగా ఖరీఫ్–2022 సీజన్‌లో జూలై నుంచి అక్టోబర్ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఖరీఫ్ సీజన్ ముగియక ముందే జమ చేశారు సీఎం జగన్.