NTV Telugu Site icon

CM Jagan: ఎకో పార్కులో పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి పనులపై సీఎం జగన్ సమీక్ష

Cm Jagan

Cm Jagan

CM Jagan: సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా.. ఈరోజు ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో రూ.1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డీఐజీ శెంథిల్ కుమార్, ఎస్పీ శిద్దార్థ్ కౌశల్, జమ్మలమడుగు ఎమ్యెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Read Also: Saurabh Ganguly: రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంపై ఏమన్నాడంటే..?

అనంతరం ఎకో పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగానే.. వేముల మండలం ప్రజాప్రతినిధులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్.. రెండు రోజుల అన్నమయ్య, కడప జిల్లాల పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకోనున్నారు. కాసేపట్లో సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

Read Also: Puri Temple: పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట.. ధనత్రయోదశి సందర్భంగా పూజలు