NTV Telugu Site icon

CM Jagan: రేపు బాకరాపురంలో ఓటు వేయనున్న ఏపీ ముఖ్యమంత్రి..

Cm Jagan

Cm Jagan

రేపు ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే పట్టణాల్లో ఉండే ప్రజలు.. తమ సొంత గ్రామాలకు చేరుకుని ఓటేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు.. రాజకీయ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. గతం కంటే ఈసారి పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా.. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Read Also: Voter Slip: మీరు ఇంకా ఓటర్‌ స్లిప్‌ తీసుకోలేదా.. టెన్షన్ వద్దు! మొబైల్‌లోనే ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఈ క్రమంలో.. సీఎం జగన్ ఈరోజు సాయంత్రం పులివెందుల వెళ్ళనున్నారు. దాదాపు రెండు నెలలపాటు ప్రచారంలో హోరెత్తించిన ముఖ్యమంత్రి.. నిన్న పిఠాపురంలో జరిగిన సభతో ప్రచారానికి తెర వేశారు. కాగా.. ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు సీఎం జగన్.. సాయంత్రం తన సతీమణి భారతితో కలిసి పులివెందులకు వెళ్తున్నారు. రేపు తాను పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గంలోని బాకరపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో.. రేపు ఉదయం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లికి రానున్నారు సీఎం జగన్. ఈ రోజు సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు.

Read Also: AP CEO: పోల్ వయొలెన్స్ జరగకూడదని జిల్లా ఎస్పీలకు ఈసీ వార్నింగ్..