Site icon NTV Telugu

Gudivada Amarnath: 7న అనకాపల్లిలో వైఎస్సాఆర్ చేయూత కార్యక్రమం

Ap Meie

Ap Meie

ఈనెల 5, 7వ తేదీల్లో సీఎం జగన్ (CM Jagan) ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తెలిపారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మార్చి 5న విజన్ ఫర్ వైజాగ్ పేరుతో పారిశ్రామిక వేత్తలు సమావేశమవుతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి 2000 మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో వైజాగ్‌ను మరింతగా ఎలా అభివృద్ధి చేయనున్నారో సీఎం జగన్ వివరించనన్నారని మంత్రి తెలిపారు. రూ. 1500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కార్యక్రమంలో కూడా సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు.

మహిళలకు శుభవార్త..
రాష్ట్ర మహిళలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ శుభవార్త తెలిపారు. మార్చి 7న మరోసారి సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లిలో వైయస్సార్ చేయూత కార్యక్రమం జరగనుంది. మహిళలకు సంబంధించిన చేయూత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. అనంతరం అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.

Exit mobile version