NTV Telugu Site icon

Cm Jagan: ఏపీలో నేడే జగనన్న విద్యాకానుక.. ప్రారంభించనున్న సీఎం జగన్..

Jagananna

Jagananna

ఏపీలో ఇవాళ్టి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ బడులకు వెళ్లే విద్యార్ధులకు అవసరమైన వస్తువులతో కూడిన విద్యా కానుక కిట్లను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెద కూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

Read Also : Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

విద్యా కానుక కిట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంగ్లోష్-తెలుగులో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా ఇస్తారు. దీంతో పాటు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6-10 తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, 1-5 తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన విద్యాకానుక కిట్ ను స్కూల్ ప్రారంభమైన తొలిరోజే అందిస్తున్నారు.

Read Also : Andrapradesh : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి..

జగనన్న విద్యాకానుక కిట్ కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా 4 దశల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించారు. ప్రతి విద్యార్థికీ దాదాపు రూ.2,400ల విలువైన జగనన్న విద్యా కానుక అందుతుంది. ప్రస్తుతం స్కూల్స్ పున: ప్రారంభం రోజే 10 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్ అందచేసేలా వైసీపీ సర్కార్ ప్రణాళిక రూపొందించింది. కార్పొరేట్ స్కూళ్ళే ప్రభుత్వ బడులతో పోటీపడేలా, విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి బడి ఇంగ్లీషు మీడియంతో సీబీఎస్ఈ సిలబస్ తీసుకువచ్చేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తుంది.