Site icon NTV Telugu

CM Jagan : సూపర్‌ కృష్ణకు నివాళులు అర్పించిన సీఎం జగన్‌

Cm Jagan

Cm Jagan

తెలుగు తెర దిగ్గజం, సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్థివ దేహాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అయితే.. తాజాగా ఏపీ సీఎం జగన్‌ కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎ జగన్‌తో పాటు ఆయన సతీమణి వైయస్ భారతీ రెడ్డి, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ వేణుగోపాలకృష్ణ, ఐఏఎస్ పొలిటికల్ సెక్రటరీ ముత్యాల రాజు,ఓఎస్డి పి కృష్ణమోహన్ రెడ్డి, అడిషనల్ పిఎస్ కె నాగేశ్వర్ రెడ్డి, సీఎస్ఓ చిదానంద రెడ్డి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఉన్నారు. అయితే.. కృష్ణ భౌతితకయాన్ని చూసి చివరిసారిగా వీడ్కోలు ఇచ్చేందుకు అభిమానులు భారీగా పద్మాలయా స్టూడియో వద్దకు చేరుకున్నారు.

Also Read : PM Narendra Modi: ప్రధాని మోడీతో రిషి సునాక్ భేటీ.. కాసేపటికే బ్రిటన్‌ కీలక నిర్ణయం
వీఐపీల కోసం అరగంట పాటు అభిమానులను నిలిపివేశారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా స్టూడియో లోపలికి అభిమానులు దూసుకుపోయారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు అభిమానుల అదుపు చేస్తున్నారు. అయితే.. అంతకుముందు నందమూరి బాలకృష్ణ కృష్ణ భౌతికకాయాని నివాళులు అర్పించారు. కృష్ణ ఎంతో మహోన్నత వ్యక్తి అని, ఆయన నటన పరంగానే కాకుండా.. వ్యక్తిత్వం కూడా చాలా గొప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ఎంతో మందికి కృష్ణ జీవితాన్ని ఇచ్చారని, భవిష్యత్‌, వర్థమాన నటులు ఆయన నుంచి నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఘట్టమనేని కుటుంబలో ఒకే ఏడాదిలో ముగ్గురు మరణించడం బాధకరమైన విషయం. వారి కుంటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారు. అయితే.. పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహానికి హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు పురోహితులు. మరికొద్దిసేపట్లో పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానంకు కృష్ణ అంతిమయాత్ర ప్రారంభంకానుంది.

Exit mobile version