NTV Telugu Site icon

CM Jagan : నేడు చిత్తూరులో సీఎం జగన్ పర్యటన

Ap Cm Jagan

Ap Cm Jagan

సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.00 గంటలకు మెసానికల్ గ్రౌండ్స్, చిత్తూరు చేరుకోనున్న సీఎం జగన్.. 10.30 గంటలకు చిత్తూరు డెయిరీ –అమూల్ డెయిరీకి శంకుస్థాపన, భూమి పూజ చేస్తారు. ఉదయం 10.55 గంటలకు చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ – ఫోటో సెషన్, ఎగ్జిబిషన్, పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు సిఎంసి ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్‌. అలాగే మధ్యాహ్నం 1.30 గంటలకు సిఎంసి ఆసుపత్రి హెలిప్యాడ్ నుండి రేణిగుంట పయనం కానున్నారు సీఎం జగన్‌.

Also Read : LPG Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. పెరిగిన సిలిండర్ ధర

 

జగనన్న పాలవెల్లువ పథకంలో భాగంగా డెయిరీని నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. 20 ఏళ్లుగా మూతబడి ఉన్న చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను పూర్తిగా తీర్చేసింది ప్రస్తుత ప్రభుత్వం. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని, అమూల్ ద్వారా రూ.385 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం సిఎం జగన్ చిత్తూరులో సోమవారం భూమిపూజ చేయనున్నారు. శంకుస్థాపన తర్వాత 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

SL vs NZ: శ్రీలంక చారిత్రక విజయం.. తొలి సిరీస్‌ సొంతం!