Site icon NTV Telugu

CM Jagan Stone Attack : సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడి అరెస్ట్‌

Ys Jagan

Ys Jagan

గత శనివారం సీఎం వైఎస్‌ జగన్‎పై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడి గుర్తించారు పోలీసులు. దాడి చేసింది సతీష్‌ కుమార్‌ అలియాస్‌ సత్తిగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం సతీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఫుట్‌పాత్‌ కోసం వేసే టైల్‌ రాయితో దాడి చేసినట్లు తెలుసుకున్నారు. రాయిని జేబులో వేసుకొని వచ్చి దాడిచేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. దాడి చేసిన సమయంలో సతీష్‌తో పాటు ఉన్న ఆకాష్‌, దుర్గారావు, చిన్నా, సంతోష్‌లను కూడా సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు బృందాలు నిందితుడి కాల్ డేటాను ట్రాక్ చేసి అతడిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నాయి. ఈ కేసులో మరికొందరు కూడా ప్రమేయం ఉన్నారా అనే విషయాన్ని గుర్తించేందుకు తదుపరి విచారణ కొనసాగుతోంది. విజయవాడ సీసీఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు.

 

Exit mobile version