NTV Telugu Site icon

CM Jagan : కమీషన్ల కోసం కక్కుర్తిపడి తనవాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చాడు

Cm Jagan Speech

Cm Jagan Speech

CM Jagan Speech at YSR Cheyutha Public Meeting

3వ విడత వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ కుప్పం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పాలు లీటర్‌పై రూ.5 ఎక్కువ వచ్చేలా అమూల్‌తో ఒప్పందం చేసుకన్నామని, అమూల్‌తో ఒప్పందం తర్వాత మిగితావారు రేట్లు పెంచి రైతులకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్‌ కుప్పానికి నాన్‌ లోకల్‌ అని ఆయన విమర్శించారు. కుప్పంకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించిన సీఎం జగన్‌.. కుప్పం నుంచి చాలా తీసుకున్నాడన్నారు. అంతేకాకుండా.. ‘ ప్రజలకు ఏం కావాలో ఆలోచించలేదు. కుప్పం నుంచి చాలా తీసుకున్నాడు.. ప్రజలకు ఏం కావాలో ఆలోచించలేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పం కరువుకు పరిష్కారం చూపలేదు. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే బాబు.. కుప్పంలో నీటిసమస్యను కూడా పరిష్కరించలేదు. హంద్రీనీవాకు బాబే అవరోధంగా మారాడు. చంద్రబాబు తనవాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డారు.

కుప్పం మున్సిపాలిటీలో డబుల్‌రోడ్‌ కూడా వేయలేకపోయాడు. రోడ్లు కూడా వేయలేని బాబు.. విమానాశ్రయం తీసుకోస్తానని ప్రజల చెవిలో పూలు పెట్టాడు. ఇంతకంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటాడా. వెన్నుపోటుకు, దొంగఓటుకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు. కుప్పం నుంచి ప్రతి చోటా చంద్రబాబు అన్యాయమే చేశాడు. కుప్పం బీసీలు పోటీ చేయాల్సిన నియోజకవర్గం. బీసీలు పోటీచేయాల్సిన చోట వారి నుంచి ఆ సీటును లాక్కున్నారు. ఇది మార్క్‌ సామాజికన్యాయం. 36 ఏళ్లల్లో కుప్పం సీటును ఒక్కసారైనా బీసీలకు ఇచ్చారా. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.66కోట్లు ఇచ్చాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.