NTV Telugu Site icon

CM YS Jagan: కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి దేశానికే ఆదర్శం కావాలి.. నాడు ఎందుకు పట్టించుకోలేదు..

Ap Cm

Ap Cm

CM YS Jagan: నాడు చంద్రబాబు ఎందుకు కిడ్నీ రోగులను పట్టించుకోలేదు అని నిలదీశారు సీఎం వైఎస్‌ జగన్‌.. పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేవలం ఇద్దరి మధ్య తేడా ఒకటే ఒక్కటి.. మీ బిడ్డకు మీపట్ల మనసు ఉందన్నారు.. పేదరికం నుంచి పేదవాడిని బయటకు లాగాలనే తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది. చంద్రబాబుకు పేదల ప్రాణాలంటే లెక్కలేదని మండిపడ్డారు. బాబు సొంత నియొకవర్గం కుప్పంకు కూడా నీరిచ్చిన చరిత్రలేదు‌.. కుప్పంకు నీరిచ్చిన ఘనత మీ బిడ్డదేనని.. బాబు ఏ ఒక్కరి మీద మానవత్వం, మమకారం చూపించడు. తనవలన మంచి జరిగిందని చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా బాబుకి లేదని ఎద్దేవా చేశారు.

Read Also: CM YS Jagan: నేను విన్నాను.. నేను ఉన్నానని చెప్పా.. హామీ నిలబెట్టుకుంటూ మీ ముందు నిలబడ్డా..

ఇక, విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు.. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు. నాన్‌ లోకల్స్‌ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు అని మండిపడ్డారు జగన్.. ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం.. ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశాను. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ తీసుకువచ్చాం.. ఉద్దానం ప్రజలకు ఇచ్చిన మాట ఇప్పటికీ గుర్తుంది. ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాం అన్నారు. దాదాపు రూ.85కోట్లతో నిర్మాణాలు చేపట్టాం. సురక్షిత మంచి నీటి కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అ‍త్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలు అందిస్తున్నాం అన్నారు.. కిడ్నీ రీసెర్చ్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా సేవలు.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం. దేశ, విదేశాల నుంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షలో రీసెర్చ్‌ జరుగుతుందన్నారు.

Read Also: Kodanda Reddy: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పని చేస్తుంది: కోదండ రెడ్డి

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నాం. విలేజ్‌ క్లినిక్‌, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నాం అని గుర్తుచేశారు సీఎం జగన్.. నాన్‌ డయాలసిస్‌ రోగులకు కూడా రూ.5వేలు ఇస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు మానవతా ధృక్పదంతో అడుగులు వేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్‌ రూ.10వేలకు పెంచామన్నారు.. దేవుడి దయతో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం. మన ప్రభుత్వంలో 13వేల మందికిపైగా డయాలసిస్‌ రోగులకు పెన్షన్‌ అందిస్తున్నామని.. ప్రతీ నెల పెన్షన్ల కోసం 12కోట్ల 54లక్షలు ఖర్చు చేస్తున్నాం అని ఈ సందర్భంగా ప్రకటించారు.. ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు మూల కారణం తెలుసుకునేందుకు సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టాం. మార్కాపురంలోనూ మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వారిని ఆదుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌..

Show comments