Site icon NTV Telugu

YSRCP: ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్..

Uttarandar

Uttarandar

ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. తాడేపల్లిలో నిర్వహించిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లతో వైసీపీ ముఖ్యుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.

Read Also: The Goat Life Trailer: మలయాళ స్టార్ హీరో మరో ప్రయోగం.. ఏం ఉందిరా మావా ట్రైలర్

ఉత్తరాంధ్రలోని మొత్తం 34 నియోజకవర్గాలకు 25 స్థానాలు కైవసం చేసుకోవాలని అధికార పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఆ దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచార సభలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఏఏ ప్రాంతాల్లో సీఎం జగన్ సభలు నిర్వహించాలన్న దానిపై నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పాల్గొనే సభల షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఉత్తరాంధ్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.

Read Also: Keshineni Nani: టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్..

Exit mobile version