CM YS Jagan: కొందరికి టికెట్లు రావొచ్చు.. మరి కొందరికి రాకపోవచ్చు.. తేల్చేసిన జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో.. గేరు మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇన్ని రోజులు చేసిన క్యాంపెయిన్ ఒకెత్తు.. ఇప్పటి నుంచే చేసే కార్యక్రమాలు మరో ఎత్తన్నారు. 175కి 175 సీట్లలో గెలవడం సాధ్యం కాబట్టే.. వైనాట్ 175 అంటున్నామన్నారు. గ్రౌండ్ లెవల్‌లో పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయన్న ఆయన.. అందుకే ప్రతిపక్షం వాళ్లు ఒంటరిగా రాకుండా పొత్తులు వెతుక్కుంటున్నారని తెలిపారు. ఇప్పటి దాకా చేసింది ఒకెత్తయితే…ఈ ఆరు నెలలు మరో ఎత్తని స్పష్టం చేశారు. ప్రజల్లో మమేకమవుతూనే…ఆర్గనైజేషన్, ప్లానింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అసెంబ్లీ టికెట్ల పైన సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరం కుటుంబసభ్యులమేనన్న జగన్.. చాలా మందికి టికెట్లు రావచ్చని.. మరి కొందరికి ఇవ్వలేకపోవచ్చన్నారు. మీరున్న పరిస్థితిని బట్టి.. ఏది కరెక్టు అని తీసుకునే అడుగును బట్టి కొన్ని నిర్ణయాలు ఉంటాయన్నారు. టికెట్ ఇవ్వకపోతే తన మనిషి కాకుండా పోడని.. టికెట్ రాకపోయినా వారంతా కూడా తన వారేనని స్పష్టం చేశారు. జుట్టు ఉంటే ముడివేసుకొచ్చని…జుట్టు లేకపోతే ముడి వేసుకునేది ఏమీ ఉండదన్నారు సీఎం జగన్.
Also Read
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు తన నిర్ణయాలకు పెద్ద మనసుతో సహకరించాలని కోరారు. ఇది కాకపోతే ఇంకోటి ఇస్తానని…అది కాకపోతే ఇంకోటి జరుగుతుందని భరోసా ఇచ్చారు. పార్టీ మీద, నాయకుడి మీద నమ్మం ఉంచాలని జగన్ సూచించారు. నాయకుడి మీద నమ్మకం ఉంచినపుడే అడుగులు కరెక్ట్‌గా పడతాయన్నారు. సర్వేలు కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయన్న జగన్… రెండు నెలల్లో ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే అంత మంచి పలితాలు వస్తాయని సూచించారు. వై ఏపీ నీడ్స్ జగన్, జగనన్న సురక్ష కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!