Site icon NTV Telugu

CM Jagan : నేడు విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Jagan

Jagan

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో స్కూల్స్‌ ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నాడు-నేడు పనుల పురోగతి, విద్యాకానుక, అమ్మ ఒడి అమలుపై చర్చించనున్నారు సీఎం జగన్‌. ఇదిలా ఉంటే.. నిన్న సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అయ్యింది. ఇందులో పలు కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వీటిలో నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ వివిధ శాఖల్లో 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో 3,920 రిజర్వ్‌పోలీసు ఉద్యోగాలు సహా కొత్త మెడికల్‌ కాలేజీలు, వివిధ విద్యాసంస్థలు, ఇతర శాఖల్లో పోస్టుల వంటి ఉన్నాయి.

Also Read : స్విమ్మింగ్ పూల్ లో అందాలు ఒలకబోస్తున్న సన్నీ లియోన్

అంతేకాకుండా.. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇది పూర్తైతే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉందన్నారు. నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష జరిపారు. పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. షెడ్యూలు ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలని తెలిపారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలని.. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read : KTR: నేడు మహబూబ్‌నగర్‌కు కేటీఆర్‌.. జడ్చర్లలో 560 డబుల్‌ బెడ్రూం ఇండ్ల ప్రారంభం

Exit mobile version