CM JaganMohan Reddy: పొలిటికల్ పంచ్ లు.. పవన్, బాబుపై విసుర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవనిగడ్డ సాక్షిగా జగన్ వరాలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చేసిన మంచి ఏంటో చెప్పుకోలేరు. బూతులు తిట్టడం మామూలుగా లేదు. చెప్పులు చూపిస్తూ.. దారుణమయిన బూతులు మాట్లాడుతుంటే.. ఇలాంటి వారు మన నాయకులా, బాధ అనిపిస్తుంది. మొన్ననే దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమని మాట్లాడిస్తున్నాడో మనం చూస్తున్నాం. మనం ఎవరికీ అన్యాయం చేయకుండా.. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూస్తున్నాం. మూడు రాజధానులు వద్దని.. మూడు పెళ్ళిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు. మీరూ చేసుకోండి అని టీవీల్లో నాయకుల్లా చెప్పుకుంటున్నవారు ఇలా మాట్లాడుతుంటే ఏం చేయాలి?
మన ఇంట్లో మూడు నాలుగు పెళ్ళిళ్లు చేసుకోమంటే ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి? ఇలాంటి వారా మన నాయకులని ఆలోచన చేయాలి. దశ, దిశ చూపగలరా? మంచి చేసిన చరిత్ర లేనివారు, వెన్నుపోటు దారులు, రంగురంగుల మేనిఫెస్టోలు ఇస్తారు. వాగ్దానాలు మరిచిపోతారు.. మేనిఫెస్టోలు కనిపించకుండా చేస్తారు. ఆ పార్టీ వెబ్ సైట్ లో మేనిఫెస్టో కనిపించదు. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ సీఎం జగన్.. మూడు రాజధానులు కాదు.. మూడు పెళ్ళిళ్ళు చేసుకోమంటే వ్యవస్థ ఏమైపోతుంది.. ఒక్క జగన్ ని కొట్టడానికి ఇంత మంది ఏకమవుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుందన్నారు. ఇలాంటి వారిపై పోరాటం సాగుతుంది. 19 నెలల్లో ఈ పోరాటం నడుస్తుంది. దేవుడి దయ వుంది.
Also Read
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..
- SUV Safety: ఎస్‌యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
మంచి జరిగిన కుటుంబం వారు నాకు అండగా వుంటారు. అబద్ధాలు, మోసాలు, కుతంత్రాలు, మీడియా, పొత్తులను నమ్ముకుంటే నేను అక్కచెల్లెళ్ళను నమ్ముకున్నాను. పేదవాడికి, పెత్తం దారులకు మధ్య జరుగుతున్న యుద్ధం.. ఇది సామాజిక న్యాయానికి, సమాజాన్ని, ముక్కలు చెక్కలు చేయాలని వారిపై జరిగే యుద్ధం. ఇలాంటి వారిని దూరంగా వుంచండి. రాబోయే రోజులలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ టీవీలు చూడవద్దు, పేపర్లు చదవద్దు. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా నిలబడండి. దత్తపుత్రుడు, మీడియా లేకపోయినా మీ అండ కావాలి. ప్రజలంతా నాకు తోడుగా నిలబడతారని నాకు నమ్మకం ఉంది
నేను దత్త పుత్రుడిని, మీడియాను నమ్ముకోలేదు. మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. సామాన్యుడికి, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. వచ్చే రోజుల్లో ఈ కుట్రలు, కుతంత్రాలు మరింత పెరుగుతాయి. మీడియాని కాదు మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేదే ప్రామాణికంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే నాకు మద్దతుగా నిలబడండి అన్నారు జగన్.
అంతకుముందు అవనిగడ్డలో రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. 35 వేల ఎకరాలు రైతులదేనని సీఎం జగన్ చెప్పారు.. భూములపై సీఎం జగన్ అన్ని హక్కులు కల్పించారు.భూమి రైతన్నకు ఒక సెంటిమెంట్. రైతన్నకు ఒక హోదాను సీఎం జగన్ కల్పించారు. 35 వేల ఎకరాలను గడిచిన ప్రభుత్వం సర్కారు భూమి అని పెట్టింది. ప్రభుత్వ భూమి కాదు.. 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతాంగానిదే భూమి అని సీఎం జగన్ ఆర్డర్ ఇచ్చారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలి. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొస్తాం అన్నారు మంత్రి ధర్మాన.
తాజావార్తలు
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్‌గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్‌బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!