ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో భాగంగా ఇప్పటికే అన్ని పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించారు. దీంతో వారందరూ వారి నియోజకవర్గాలలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 25న సీఎం జగన్ పులివెందుల నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన శ్రీకాకుళంలో జరిగే ‘ మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ముగించుకున్న తర్వాత నేరుగా పులివెందులకు చేరుకొని అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది.
Also Read: PM Modi: శ్రావణంలో మటన్ తింటూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు.. రాహుల్, లాలూపై విమర్శలు..
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత జగన్ తన పార్టీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఏప్రిల్ 22న జగన్ మోహన్ రెడ్డి తరుపున కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పట్టాలను ముందుగానే చేయనున్నారు. అయితే ఇది కేవలం ముందు జాగ్రత్త కోసమే అని తెలుస్తోంది.
Also Read: Rajnath Singh: డైనోసార్‌లకు పట్టిన గతే కాంగ్రెస్‌కి పడుతుంది..
ఇకపోతే జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అభ్యర్థిగా సతీష్ కుమార్ పై 90000 పైచిలుకు ఓట్లతో భారీ విజయాన్ని అందుకున్నారు. అంతకు ముందు కూడా ఆయనపై వైయస్ జగన్ విజయం సాధించారు. కాకపోతే ఈసారి జగన్ కు పోటీగా పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీటెక్ రవీందర్ రెడ్డిని పోటీలో ఉంచారు. చూడాలి మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎంత మెజారిటీ సాధిస్తారో.