Site icon NTV Telugu

Cm Jagan Met CJI Chandrachud: సీజేఐ చంద్రచూడ్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ

Jagan Cj

Jagan Cj

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ చంద్రచూడ్ తొలిసారి విజయవాడ వచ్చారు. నోవోటెల్ హోటల్‌ కి చేరుకున్నారు సీఎం జగన్… సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో జగన్ భేటీ అయ్యారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఏపీకి వచ్చారు జస్టిస్ చంద్రచూడ్.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ చంద్రచూడ్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు.

తిరుమ‌ల ప‌ర్యట‌న ముగించుకొని విజ‌య‌వాడ నోవాటెల్ హోట‌ల్‌కు చేరుకున్న సీజేఐ చంద్రచూడ్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వేంక‌టేశ్వర‌స్వామి ప్రతిమ‌ను సీజేఐకి అంద‌జేసి ఘ‌నంగా స‌త్కరించారు.

Read Also:Artist Bali Son Gokul Died: ప్రముఖ చిత్రకారుడు బాలికి పుత్రవియోగం!

సీఎం జగన్ తో భేటీ అనంతరం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ డి వై చంద్రచూడ్. దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందచేశారు. అమ్మవారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ అధికారులు. సీజేఐ పర్యటన సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు విజయవాడ పోలీసులు.

Read Also: Guvvala Balaraju : ఎమ్మెల్యే బాలరాజుకు డాక్టరేట్.. అవార్డు ప్రదానం చేసిన ఓయూ

Exit mobile version