Memantha Siddham Bus Yatra: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 15వ రోజు ఆదివారం (ఏప్రిల్ 14) నాటికి సంబంధించిన షెడ్యూల్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేపు ( ఆదివారం ) ఉదయం 9 గంటలకు కేసరపల్లి రాత్రి బస నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయలు దేరనున్నారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకొన్న తర్వాత సీఎం జగన్ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.
Read Also: Venu Swamy : భార్యతో వేణుస్వామి మరో రీల్.. బాగా భయపడ్డాడే..
ఆ తర్వాత జొన్నపాడు, జనార్దణపురం మీదగా మధ్యాహ్నం 3. 30 గంటలకు గుడివాడ శివారు నాగ వరప్పాడు దగ్గరకు చేరుకుని వైసీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇక, అక్కడి నుంచి గుడివాడ, బొమ్ములూరు, గుడ్ల వల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్, పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి జగన్ చేరుకుంటారు.
Read Also: Bournvita: బోర్న్‌విటాలో చక్కెర చేదును మిగిల్చిందా..? “హెల్త్ డ్రింక్” ట్యాగ్ ఎందుకు కోల్పోయింది..?
కాగా, నేడు ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగుతుంది. కనకదుర్గమ్మ వారధిగా మీదుగా విజయవాడ సిటీలోకి ఎంట్రీ ఇచ్చింది. సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనం పలుకుతున్నారు. వన్స్‌మోర్ సీఎం జగన్ అని ప్రజలు నినదిస్తున్నారు. కాగా, తాడేపల్లి జంక్షన్‌లో సీఎం జగన్ బస్సుయాత్రకు శ్రీమతి వైఎస్ భారతి సంఘీభావం తెలిపారు. ప్రజలతో కలిసి వైసీపీ అధినేతకు ఘన స్వాగతం పలికారు. ఇక, బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికిశ్రీమతి వైఎస్ భారతి అభివాదం చేయగా.. బస్సులో నుంచి సీఎం జగన్ ప్రతి అభివాదం చేశారు.