CM Jagan: పల్నాడు జిల్లాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. చీకటీగల వారి పాలెం దగ్గర ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా బస్సు యాత్రలో పాల్గొన్న సీఎం జగన్ కు పల్నాడు జిల్లా వైసీపీ క్యాడర్ అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యాత్రకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. చీకటి గల వారి పాలెం నుంచి వినుకొండ శివయ్య స్తూపం వరకు సీఎం జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు.
Read Also: Cricket Australia: 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటన.. రెండేళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్
ఇక, శివయ్య స్తూపం దగ్గర ప్రజలని ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం శివయ్య స్తూపం నుంచి శావల్యాపురం మండలం గంటావారిపాలెం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రికి గంటా వారి పాలెంలో జగన్ బస చేయనున్నారు. అలాగే, రేపు ఉగాది వేడుకల్లో వైసీపీ చీఫ్, సీఎం జగన్ పాల్గొనే అవకాశం ఉంది. సీఎం ఈ రాత్రి నుంచి ఎల్లుండి ఉదయం వరకు గంట వారి పాలెంలోనే బస చేయనున్న నేపథ్యంలో భారీగా పోలీసులతో భద్రతా ఏర్పా్ట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.