శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ మోహాన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అందించామని తెలిపారు. అవ్వా తాతలకు ఇంటి వద్దకే పింఛన్, రేషన్, పథకాలు, పౌర సేవలు తలుపుతట్టి అందిస్తున్నాని అన్నారు. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మహిళలకు, మత్స్యకారులు, నేతన్నలకు తోడుగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు.. మూలపేట పోర్టు కడుతున్నాం.. భోగాపురం ఎయిర్ పోర్ట్, ఉద్దానం కిడ్ని సమష్యకు పరిష్కారం చూపించే విధంగా రూ.700 కోట్ల త్రాగునీటి ప్రాజెక్ట్ చేపట్టామని సీఎం చెప్పారు. అంతేకాకుండా.. రూ. 80 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసామని.. 4 మెడికల్ కళాశాలలు కడుతున్నామని అన్నారు. కురుపాంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని.. నాలుగు వందల కోట్లతో నాలుగు వందల సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేసామని సీఎం జగన్ తెలిపారు.
Arya: నా జీవితాన్నే మార్చేసిన సినిమా.. ఎమోషనలైన బన్నీ..
చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ పేదకైనా పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒకటైనా ఉందా..? అని సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడుసార్లు సీఎం చేసి ప్రజల్ని మోసం చేసారని అన్నారు. అధికారంలోని వచ్చేందుకు ఎన్నో అబద్దాలు చెప్పారని.. 2014లో హామీలు బాబు అమలు చేసారా.? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణ మాఫీ చేస్తామని చేసారా? అని పేర్కొన్నారు. అడబిడ్డ పుడితే మహాలక్ష్మీ పథకం అన్నారు..? ఏ ఒక్కరి అకౌంట్ లో ఒక్క రూపాయి వేసారా?.. ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చారా.? అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నారు.. ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు భూమి ఇచ్వారా.? అని సీఎం దుయ్యబట్టారు.
Konda Sangeetha Reddy: ప్రజలందరి గుండెల్లో మోడీ నిలిచిపోయారు..
చంద్రబాబు సింగపూర్ సిటీ అన్నారు చేసారా.?.. ప్రతి పట్టణం హైటెక్ సిటీ అన్నారు చేసారా..? ఏ ఒక్క హామీ అమలు చేయని బాబుని నమ్మవచ్చా? అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజలు అందరూ ఆలోచించి ఓటేయాలని కోరారు. మోసాలు, అబద్దాలపై యుద్ధం చేస్తున్నామని.. ఇంటింటికీ వచ్చే అవ్వా తాతల పింఛన్ అడ్డుకున్నారని తెలిపారు. ఇన్ని నెలలు పింఛన్ అందించిన జగన్, చివరి రెండు నెలలు అందించలేడా..? అని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ప్రజల దీవెనలు ఉన్నాయని సీఎం తెలిపారు. నా అక్కచెల్లెమ్మాలు, అవ్వతాతలు, రైతన్నాలు అండగా నిలబడతారన్నారు. బాబు ఓటుకు రెండు లేదా నాలుగు వేలు ఇస్తాడని.. ఎన్నికలలోనే బాబు డబ్బులు ఇస్తారని తెలిపారు. తాను ప్రతి ఏటా క్యాలండర్ ఇచ్చి మరీ సంక్షేమం చేసేందుకు సాకులు చూపలేదు.. వెనకడుగు వేయలేదన్నారు.చంద్రబాబు డబ్బులు ఇస్తే వద్దనకుండా తీసుకోండి.. ఓటు వేసేప్పుడు మాత్రం ప్యాన్ను గుర్తుపెట్టుకోండి సీఎం జగన్ తెలిపారు.