ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రేపు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు సీఎం జగన్. అంతేకాకుండా.. అమిత్‌షా సహా కేంద్రమంత్రులను కలిసే అవకాశం. ఈ నెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం జగన్ హస్తినలోనే ఉంటారు. 5వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో.. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు. ఒకవేళ అపాయింట్‌మెంట్ దొరికితే అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు.
Also Read : President: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రాకా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఈ పర్యటనలో ప్రధానంగా ఏపీకి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, పెండింగ్‌లో ఉన్న అంశాలు, సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. ఈ నెల 6న ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి వస్తారు. ప్రధానితో భేటీలో మరికొన్ని కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులకు వైఎఎస్సార్‌సీపీ మద్దతు కోరే ఛాన్స్ ఉందంటున్నారు. ముఖ్యంగా రాజ్యసభలో కేంద్రానికి మద్దతు కావాల్సి అనివార్యం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది.
Also Read : Mrunal Thakur : కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను..