మృనాల్ ఠాకూర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది మృనాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది.మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకుంది ఈ భామ.తెలుగులో మొదటి సినిమా హిట్ కావడంతో ఈ భామకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.ప్రస్తుతం ఈమె నాచురల్ స్టార్ నాని సినిమాలో నటిస్తూ బిజీ గా ఉంది.ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయడానికి కూడా ఒప్పుకుంది..ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
సోషల్ మీడియా వేదికగా ఈమె తరచూ తనకు సంబంధించిన అన్ని సంగతులను షేర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృనాల్ తన కెరియర్ గురించి అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. తాను సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత అవకాశాలను అందుకుంటున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. కెరియర్ మొదట్లో చాలామంది తనను బాడీ షేమింగ్ చేశారని ఆమె తెలియజేసింది.. కెరీర్ ఆరంభంలో నేను కాస్త బొద్దుగా ఉండేదాన్ని. నా శరీరాకృతి నిండు కుండ లా ఉందని చాలామంది కామెంట్ చేసేవారు. దాంతో సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయాలంటేనే నాకు భయమేసేది.నా గురించి ఇలాంటి కామెంట్స్ రావడంతో నేను సోషల్ మీడియాకు కూడా కొద్ది రోజులపాటు దూరంగా ఉన్నానని ఆమె తెలిపారు. అయితే ఒక రోజు నేను అమెరికా వెళ్లిన తర్వాత అక్కడ కొందరు ‘ఇండియన్ కర్దాషియన్’ అని అన్నారు అప్పటి నుండి నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.ఎవరూ ఎన్ని ట్రోల్స్ చేసిన పట్టించుకోవడం మానేసాను.ధైర్యంగా సోషల్ మీడియాలో నా ఫోటోలను షేర్ చేయడం మొదలు పెట్టాను అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.ఈ సందర్భంగా మృనాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.