NTV Telugu Site icon

CM Jagan : చంద్రబాబు పాలనలో ఉన్నదేంటి.. దోచుకో, తినుకో, పంచుకో

Cm Jagan Speech

Cm Jagan Speech

రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గతంలో ఒక ముసలాయన సీఎంగా ఉన్నపుడు ఈ పథకాలు ఉన్నాయా.. చంద్రబాబు పాలనలో ఉన్నదేంటి.. దోచుకో, తినుకో, పంచుకో అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. ‘ప్రతీ లబ్ధిదారుడికి పారదర్శకంగా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు.. ఆ ముసలాయన హయాంలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లోకి వేశారా.. గతంలో జరగనివి.. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో ఆలోచన చేయాలి.. ఈ డబ్బంతా ఆ ముసలాయన పాలనలో ఎవరు దోచుకున్నారు.. ఎవరు పంచుకున్నారు..

Also Read : PVN Madhav : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు

ఎవరు తిన్నారు.. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ ముసలాయాన మాట్లాడడు.. సెల్ఫీ అంటాడు.. నాలుగు ఫేక్ ఫోటోలు దిగుతాడు.. ఫేక్ ఫోటోలతో సేల్ఫీ ఛాలెంజ్ అంటాడు.. ఛాలెంజ్ అంటే అవికాదు.. ప్రతీ పేదవాడి ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మా వల్ల జరిగిన లబ్ది అని చెప్పగలగడం ఛాలెంజ్.. నువ్వు బాగా చేశావయ్యా అని పేదలు అనగలిగితే దాన్ని అంటారు సెల్ఫీ అని.. పేద వాడికి చేసిన మంచి ఎంత చెప్పే సత్తా ఉందా చంద్రబాబు.. నిజాలు దాచి నిందలు, అబద్ధాలు దాచి ప్రచారాలు చేస్తారు.. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజాలు అని చెప్పే ప్రయత్నం.. గత పాలనలో వారేం చేశారో చెప్పాలి.. సెల్ఫీ దిగే నైతికత, పాలన గురించి ఇంటికి స్టిక్కర్ వేసే దైర్యం ఉందా.. గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను రోడ్లమీద నిలబెట్టారు.. ఈ మోసాల బాబును గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారో ప్రతీ ఒక్కరూ ప్రశ్నించాలి’ అని ఆయన అన్నారు.

Also Read : BRS Athmeeya Sammelanam: ఖమ్మంలో విషాదం.. సిలిండర్ పేలి తెగిపడ్డ కాళ్లు, చేతులు