Site icon NTV Telugu

CM Jagan : రేపు ఢిల్లీకి సీఎం జగన్‌

Ys Jagan Review Meeting

Ys Jagan Review Meeting

సీఎం జగన్‌ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 6గంటల 45 నిమిషాలకు ఢిల్లీ చేరుకుని 1 జన్‌పథ్‌ నివాసంలో రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్‌. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే.. రేప ఉదయం పల్నాడు జిల్లా వినుకొండ వేదికగా జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్‌. ఈ మేరకు సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు ముఖ్యమంత్రి సభకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. జనవరి 30వ తేదీన ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు.

Also Read : Beating Retreat Ceremony : ఘనంగా రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి, ప్రధాని

ఉదయం 11.05 నుంచి 12.20 వరకు వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్‌. వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి సాయం చేసే దిశగా ప్రభుత్వం జగనన్న చేదోడు పథకం ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు తదితరులకు ఆర్థిక సాయం అందించేందుకు రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఆయా వృత్తులు చేసుకునే వారికి ఏడాది కింద రూ.10 వేల చొప్పున సాయాన్ని అందిస్తోంది. తెలుపు రంగు రేషన్‌ కార్డు కలిగి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు ఈ పథకానికి అర్హులు.

Also Read : Boat capsize : విహారంలో విషాదం.. బోటు బోల్తాపడి పదిమంది చిన్నారుల మృతి

Exit mobile version