క్రిస్మస్ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇడుపులపాయల నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల చేరుకున్న సీఎం జగన్ సీఎస్ఐ చర్చికి వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మతో పాటు భార్య భారతి కుటుంబ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కొందరు స్థానికుల సమక్షంలో క్రిస్మస్ ప్రార్థనలో జగన్ పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి తల్లికి తినిపించారు. విజయమ్మ కూడా కేక్ కట్ చేసి కుమారుడు జగన్కు తినిపించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్యాలెండర్ కూడా ఆవిష్కరించారు సీఎం జగన్. క్రిస్మస్ వేడుకల అనంతరం సీఎం జగన్ పులివెందుల నుంచి బయలుదేరి కడప విమానాశ్రయం చేరుకున్నారు.
Also Read : China On Relations With India: మేము సిద్ధంగా ఉన్నాం.. భారత్‌తో సంబంధాలపై చైనా
కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉంటే.. క్రిస్మస్ సందర్భంగా సీఎం జగన్.. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్ జగన్.
Also Read : Ind vs Ban 2nd Test: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్