NTV Telugu Site icon

CM Jagan : ఏపీలో జనవరి నుంచి పెన్షన్‌ పెంపు

Cm Jagan

Cm Jagan

కుప్పంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా సర్వాంగ సుందరంగా కుప్పం ముస్తాబైంది. కుప్పంన్ని వైసీపీ జెండాలతో నేతలు నింపేశారు. తొలిసారిగా సీఎం హోదాలో కుప్పంకు జగన్ విచ్చేశారు. అయితే.. ఈ సందర్భంగా 3వ విడత వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ కుప్పం నుండి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26,39,703 మంది మహిళలకు రూ.4,949.44 కోట్లు లబ్ది పొందారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కుప్పం నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 26,39,703 మందికి వైఎస్సార్‌ చేయూత అందిందని, వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ నిధులు విడుదల చేశామన్నారు.

 

కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదని, కుప్పం అంటే అక్కాచెల్లెళ్ల అభివృద్ధి అని, కుప్పం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి అని ఆయన అన్నారు. ప్రతి మహిళకు ఏటా రూ.18,750 అందిస్తున్నామని, మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోందన్నారు. అంతేకాకుండా.. జనవరి నుంచి రూ.2,500 ఉన్న పెన్షన్‌ .2,750కు పెంచుతున్నట్లు, 3 వేల వరకూ పెంచుతామని ఆయన ప్రకటించారు. 39 నెలల్లో DBT ద్వారా సొమ్ము రూ.1,71,244 కోట్లు అందించామని, అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు తేడా గమనించండని సీఎం జగన్‌ అన్నారు.