Site icon NTV Telugu

Minister Audimulapu Suresh: మాదిగలంతా రుణపడి ఉంటారు.. ఆ కేసుల మాఫీకి సీఎం అంగీకారం

Adimulapu

Adimulapu

విజయవాడలోని స్వరాజ్య మైదానంలో డా.బిఆర్.అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులను మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఫినిషింగ్ పనులు చివరి దశకు వచ్చినట్లు ఆయన అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని.. అతి త్వరలోనే అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా దేశం నలుమూలల నుంచి అంబేద్కర్ విగ్రహం చూసేందుకు పర్యాటకులు రావడం ఖాయమని ఆయన అన్నారు.

2018 Telugu Collections: సైలెంటుగా కోట్ల కలెక్షన్లు వెనకేసిన బన్నీ వాసు!

దళితులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ఎంతో నమ్మకం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నమ్మకంతోనే హృదయాలను గెలవగలమని.. చంద్రబాబులాగా మాటలతో మాయలు చేస్తే ప్రజలు విశ్వసించరని ఆరోపించారు. చంద్రబాబు మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన సమయంలో కేసులు పెట్టించాడని మండిపడ్డారు. అంతేకాకుండా ఎస్సీలపై కేసులు పెట్టించిన చంద్రబాబును ఎలా నమ్మాలి అని మంత్రి ప్రశ్నించారు.

Rashmi: రష్మీని రాత్రికి వస్తావా అని అడిగిన ఆటో రాంప్రసాద్.. ?

వర్గీకరణ కోసం పోరాటం చేసిన సమయంలో పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎం జగన్ ను కోరినట్లు మంత్రి ఆదిమూలపు తెలిపారు. మందకృష్ణ మాదిగతో పాటు మాదిగలందరి పైనా పెట్టిన కేసులు ఎత్తేయాలని వినతిపత్రం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. గరగపర్రు , లక్ష్మీపురం వంటి ఘటనల్లో ఎస్సీల పై పెట్టిన కేసులను ఎత్తేయాలని కోరమన్నారు. అందుకు కేసులు మాఫీ చేసేందుకు సీఎం అంగీకరించారని మంత్రి తెలిపారు. మాదిగలంతా సీఎం జగన్ మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

Exit mobile version