NTV Telugu Site icon

Chandrababu: నేడు వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సమీక్ష..

Chandrababu

Chandrababu

Chandrababu: నేటి నుంచి ప్రభుత్వంలోని అన్ని శాఖలపై ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా చంద్రబాబు నాయుడు సమీక్షలు చేయనున్నారు. అందులో భాగంగానే.. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష చేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలపై సీఎం దృష్టి సారించనున్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గత ఐదేళ్లలో జరిగిన పనులపై కూడా శ్వేత పత్రం విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తుంది. పోలీవరం పరిస్థితిపై శ్వేతపత్రం సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.

Read Also: Kalki First Day Collections : అదరగొట్టిన భైరవ.. ఫస్ట్ డే కల్కి 2898AD సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

ఇక, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఐదేళ్లలో ఏం జరిగిందో ప్రజలకు చెబుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈఎన్సీ, ఉన్నతాధికారులతో అర్థరాత్రి వరకు మంత్రి నిమ్మల రామానాయుడు కసరత్తు చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై వైట్ పేపర్ విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే, 7 శాఖల్లో స్థితిగతులపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.