CM Chandrababu on seaplane: విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. మరికొందరు ప్రజాప్రతినిధులు.. అధికారులతో కలిసి సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లారు.. అయితే, సీప్లేన్ పై అధికారులు, ప్రజా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు సీఎం చంద్రబాబు.. రాబోయే రోజుల్లో రెండు, మూడు విమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు.. పచ్చదనం, జలాల మధ్య శ్రీశైలంలో సీ ప్లేన్ చాలా అందంగా ఉందన్న ఆయన.. భారత్ లో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం అన్నారు.. అయితే, సీ ప్లేన్, బోట్లు, రోడ్డు రవాణాను లింక్ చేస్తేబాగుంటుందన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: CM Revanth Reddy: ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
శ్రీశైలంలో ఎంత భూమి అందుబాటులో ఉందని వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. అయితే, 5 వేల ఎకరాలు ఉందని సమాధానం చెప్పారు అధికారులు.. ఇక, శ్రీశైలం సీ ప్లేన్ దిగే ప్రాంతంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తే పర్యాటకులకు బాగుంటుందని పేర్కొన్నారు.. రోప్ వే వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.. అయితే, రోప్ వేలో 4 క్యాబిన్ లు వున్నాయని కలెక్టర్.. సీఎంకు వివరించారు.. పాతాళ గంగ మట్టి రోడ్డు వివరాలను కూడా అడిగిన తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, విజయవాడ నుంచి సీ ప్లేన్‌లో శ్రీశైలం చేరుకున్న ఆయన.. రోప్ వేలో పాతాళ గంగ నుంచి శ్రీశైలం చేరుకున్నారు.. ఇక, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత.. తిరిగి విజయవాడకు సీ ప్లేన్‌లో వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..