NTV Telugu Site icon

Minister Narayana: రాజధానిలో ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉంది..

Narayana

Narayana

రేపు ( గురువారం) రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు అని మంత్రి నారాయణ తెలిపారు. కూల్చేసిన ప్రజావేదిక దగ్గర నుంచి పర్యటన ప్రారంభమవుతుందన్నారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ముందుగా సందర్శిస్తారు.. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జడ్జిలు, అధికారుల క్వార్టర్లను పరిశీలించనున్నారు అని చెప్పారు. ఇక, చివరగా సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసును సీఎం చంద్రబాబు పరిశీలించిన తర్వాత అక్కడే మీడియాతో చంద్రబాబు మాట్లాడతారు అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Read Also: INDW vs SAW: సౌతాఫ్రికాపై శతకాలు బాదిన టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్..

ఇక, ముందుగా కమిటీలు వేసి అమరావతి రాజధానిలో జరిగిన డ్యామేజీను పరిశీలిస్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. టెండర్లకు పెట్టిన కాలపరిమితి ముగిసింది.. కాబట్టి కొత్తగా టెండర్లు పిలవాలి.. కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలుస్తామన్నారు. టెండర్లు కనీసం మూడు నుంచి నాలుగు నెలలు టైం పడుతుంది.. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధానిలో సామాగ్రి దొంగిలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. రాజధానిలో ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉంది.. న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.

Show comments