NTV Telugu Site icon

CM Chandrababu: రేపు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చంద్రబాబు.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.. ఇక, సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను క‌లెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప‌రిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 11వ తేదీన అంటే రేపు.. భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఎయిర్‌పోర్టు ప్రాంతంలో క‌లెక్టర్ ప‌ర్యటించి, ఏర్పాట్లపై అధికారుల‌తో స‌మీక్షించారు. భ‌ద్రతా ఏర్పాట్లపై ఎస్పీ దీపికా పాటిల్‌తో చ‌ర్చించారు. ఇప్పటికే నిర్మిత‌మైన ర‌న్‌వేపై ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ స్థలాన్ని క‌లెక్టర్ ప‌రిశీలించారు. అక్కడి నుంచి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ వ‌ద్దకు చేరుకొని వివిధ శాఖ‌ల అధికారుల‌తో మాట్లాడారు. ఫొటో ఎగ్జిబిష‌న్‌, వీఐపీ లాంజ్ ఏర్పాట్లపై ప‌లు సూచ‌న‌లు చేశారు. వ‌ర్షాకాలం కావ‌డంతో, జెర్మన్ హేంగ‌ర్లతో ప‌టిష్టమైన షెడ్లను నిర్మించాల‌ని సూచించారు. అనంత‌రం టెర్మిన‌ల్ భ‌వ‌నం వ‌ద్దకు చేరుకొని ఏర్పాట్లపై స‌మీక్షించారు. టెర్మిన‌ల్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల ప‌రిశీలించనున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు.. జిల్లా ప‌ర్యటనకు వస్తున్న నేప‌థ్యంలో ఏర్పాట్లు ప‌క్కాగా ఉండాల‌ని, ఎక్కడా ఎటువంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని అధికారుల‌ను ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్..

Read Also: Bharateeyudu 2: తెలంగాణాలో భారతీయుడు 2 టికెట్ రేట్లు పెంపు ఎంతంటే?

ఇక, రేపు విశాఖపట్నంతో పాటు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.. రేపు ఉదయం 11 గంటలకు అనకాపల్లి దార్లపూడికి చంద్రబాబు చేరుకోనున్నారు.. 11:20కి పోలవరం లెఫ్ట్ కెనాల్ అక్విడెక్ట్‌ను పరిశీలిస్తారు.. అనంతరం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు.. మధ్యాహ్నం 12.30 – 1.30 వరకు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై సమీక్ష నిర్వహిస్తారు.. మధ్యాహ్నం 2:30కి మెడ్ టెక్ జోన్ భవనాల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొననున్న ఆయన.. సాయంత్రం 4.50కి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.. సాయంత్రం 6 గంటలకు విజయవాడకు తిరుగుప్రయాణం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు..

Read Also: Raj Tarun: 10 ఏళ్ల క్రితమే పెళ్లి.. అబార్షన్లు.. మారు పేరుతో విదేశీ ట్రిప్పులు.. రాజ్ తరుణ్ కేసులో సంచలనాలు

కాగా, ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించిన విషయం విదితమే.. గత టీడీపీ ప్రభుత్వంలో 2015 లో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.. 2019 నాటికి కూడా టెండర్ ప్రాసెస్ చేయడం జరిగింది అని గుర్తుచేశారు రామ్మోహన్‌నాయుడు.. అయితే, గత వైసీపీ ప్రభుత్వంలో చాలా ఆలస్యం జరిగిందన్నారు. డిసెంబర్ 26 నాటికి పూర్తిగా చేస్తమని చెప్తున్నారు.. కానీ ఆరు నెలలు ముందే కంప్లీట్ చేయాలని అదేశించాం.. అందుకు ఏమైనా సమస్యలు అంటే నా దృష్టిలో తీసుకు రావొచ్చు.. ఏది ఏమైనా 2026కి ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇరువురూ నేతలు ఉత్తరాంధ్రను అభివృద్ది చేయాలని చూస్తున్నారు.. ఏపీని ప్రపంచం పటంలో పెట్టడానికి కృషి చేస్తున్నారు.. ఈ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా 6 లక్షలు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ నెల 11 తేదీన సీఎం చంద్రబాబు నాయుడు.. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తారని.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్న విషయం విదితమే.