NTV Telugu Site icon

CM Chandrababu: సీఎం అయ్యాక తొలిసారి కుప్పంకు చంద్రబాబు.. రెండు రోజుల షెడ్యూల్‌ ఇదే..

Babu

Babu

CM Chandrababu: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు అధికారులు.. ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం కుప్పం పర్యటన కొనసాగనుండగా.. 25న మధ్యాహ్నం 12:30 కు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకోనున్న సీఎం.. మధ్యాహ్నం 1 గంటకు అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తారు.. 1:30కి ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. 3:30కి పీఈఎస్ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేయనున్నారు సీఎం చంద్రబాబు.

Read Also: Toxic Liquor: తమిళనాడులో 55కి చేరిన మృతుల సంఖ్య.. 88 మందికి చికిత్స..!

ఇక, రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన వివరాలను పరిశీలిస్తే.. ఉదయం 10 గంటలకు జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు చంద్రబాబు.. ఉదయం 11 గంటలకు ప్రజల నుండి వినతులను స్వీకరింనున్న ఆయన.. మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం మండలంలోని గుండిశెట్టిపల్లి వద్ద కాలువను పరిశీలిస్తారు.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు విశ్రాంతి తీసుకుని.. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పీఈఎస్ కళాశాలలోని ఆడిటోరియంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం కానున్నారు.. ఇక, సాయంత్రం 4:30 గంటలకు రెండు రోజుల కుప్పం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కుప్పంలో చంద్రబాబు విజయఢంకా మోగించిన విషయం విదితమే.. తన సమీప ప్రత్యర్థి కేఆర్‌జే భరత్ పై 47,340 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు చంద్రబాబు.. 1989 నుంచి కుప్పం నుండి పోటీ చేస్తూ వస్తున్న చంద్రబాబు.. తొమ్మిదోసారి కూడా కుప్పం నుండి గెలుపొందిన విషయం విదితమే.