NTV Telugu Site icon

CM Chandrababu: రియల్ టైం గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష!

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

అమరావతిలో ఈరోజు మద్యాహ్నం 12 గంటలకి స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డుపై సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు సంబంధించి చర్చిస్తారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఇంధన శాఖలో కొన్ని కీలక ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలపనుంది. ఈ సమావేశం కోసం ఉదయం 11 గంటలకు సీఎం సచివాలయంకు చేరుకుంటారు.

ఈ నెల 31న పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పల్నాడు జిల్లాకు సీఎం బయలుదేరుతారు. నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామాల్లోని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. 11.35-12.35 వరకు లబ్ధిదారులతో సీఎం ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 12.40-01.00 వరకు పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని సీఎం దర్శించుకుంటారు. మధ్యాహ్నం 02.55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

మరోవైపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పంచాయితీ రాజ్ అధికారులు, ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ సమావేశం కానున్నారు. ఇటీవల ఎంపీడీఓపై జరిగిన దాడి నేపథ్యంలో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వరిస్తున్నారు.

Show comments