NTV Telugu Site icon

CM Chandrababu: నేడు అన్నమయ్య జిల్లాకు సీఎం.. సంబేపల్లిలో పెన్షన్ల పంపిణీ..

Cbn

Cbn

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇవాళ అన్నమయ్య జిల్లాకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో జరిగే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి సంబేపల్లి పీఎన్ కాలనీకి హెలికాప్టర్‌లో వెళ్తారు. హెలిపాడ్ నుంచి నేరుగా సంబేపల్లికి రోడ్‌ మార్గాన వెళ్తారు. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పింఛన్‌ అందిస్తారు. దళిత మహిళ మంగమ్మతోపాటు బీసీ వర్గానికి చెందిన వికలాంగుడు గోర్ల వెంకటేష్‌ నివాసానికి చేరుకుని వారికి పెన్షన్‌ ఇస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు.

Read Also: Budget 2025: ఆదాయపు పన్నులో పెద్ద ఉపశమనం.. మధ్య తరగతికి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్

ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది కూటమి సర్కార్‌. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా ఒకటవ తేదీకి పెన్షన్‌ను అందజేస్తోంది. ఒకవేళ ఆ రోజు సెలవు దినం అయితే కనుక ఒకరోజు ముందుగానే పించన్‌ను అందిస్తోంది. దాదాపు ప్రతి నెల ఏదో ఓ గ్రామంలోని పెన్షన్‌ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సంబేపల్లికి వెళ్తున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన ఏర్పాట్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పర్యవేక్షించారు. పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.

సీఎం చంద్రబాబు టూర్‌ షెడ్యూల్..
* ఉదయం 11:10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న సీఎం..
* మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు..
* మధ్యాహ్నం 12:05 గంటల కు కడప ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న సీఎం..
* మధ్యాహ్నం 12:20 కి సంబేపల్లి మండలం పీఎన్ కాలనీ చేరుకోనున్న ఏపీ సీఎం..
* 12:40 గంటలకు సంబేపల్లి కు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్న సీఎం…
* 12:50 గంటలకు సంబేపల్లిలోని మంగమ్మ, గోర్ల వెంకటేష్ ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు పంపిణీ..
* అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు…
* సంబేపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు…
* పీఎన్ కాలనీ నుంచి హెలికాప్టర్ లో కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. కడప నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్తారు..