NTV Telugu Site icon

CM Chandrababu: కలుషిత ఆహారంతో విద్యార్థులు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Chandrababu

Chandrababu

CM Chandrababu:  అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కలుషిత ఆహారంతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిలో జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

Read Also: Kolkata Doctor Case: కోల్‌కతా ఆస్పత్రిపై దాడి తృణమూల్ గుండాల పనే.. బాధితురాలి న్యాయవాది..

కైలాసపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 86 మంది విద్యార్థులు ఉండగా.. వారిలో 27 మంది నిన్న ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది హూటాహూటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక, తీవ్ర అస్వస్థతకు గురైన స్టూడెంట్స్ లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించగా.. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో.. డిప్యూటీ డీఈఓ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడంతోనే విద్యార్థులు ఆనారోగ్యం బారిన పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు విద్యార్థుల మృతితో.. కైలాసపట్నంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.