Site icon NTV Telugu

CM Chandrababu: జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు!

Chandrababu Cm

Chandrababu Cm

మళ్లీ ఆకస్మిక తనిఖీలు తప్పవని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే నెల 12 నుంచే ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు. ప్రజా సేవ పధకాల అమలు, సంక్షేమ పథకాల పూర్తిస్థాయి సంతృప్తి ఇంకా కనిపించాలన్నారు. ఆర్టీసీ సేవల్లో ఇంకా మార్పులు రావాలని, నాణ్యత పెరగాలన్నారు సీఎం చంద్రబాబు సూచించారు. దీపం పథకంలో ఇచ్చే మూడు సిలండర్ల సబ్సిడీ ఒకేసారి జమ చేస్తామన్నారు. ప్రభుత్వ సేవల్లో డేటా కీలకం అని సీఎం అధికారులతో అన్నారు.

Also Read: Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌!

‘జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు జరగొచ్చు. ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాల్సిందే. ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగుపడాలి. దీపం లబ్దిదారుల ఖాతాలో ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము జత అవుతుంది. డాటా అనలిటిక్స్‌కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. రేషన్ పంపిణీ నాణ్యతపై ప్రజల సంతృప్తి పశ్చిమగోదావరి జిల్లా ప్రధమ స్థానంలో ఉంది. కొన్ని సంక్షేమ పథకాల అమలు, ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయిలో సంతృప్తి కనిపించాలి. ఆర్టీసీ టాయిలెట్స్, తాగునీటి నిర్వహణ విషయంలో అసంతృప్తి వస్తోంది. త్వరలో డ్వాక్రా మహిళలకు తడి చెత్త నిర్వహణ బాధ్యత, కంపోస్టు తయారీ అప్పగిస్తాం. ప్రభుత్వ సేవల్లో డేటా కీలకం’ అని ప్రభుత్వ పథకాలు, సేవలపై సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు.

 

Exit mobile version