Site icon NTV Telugu

AP CM Chandrababu: వరద నష్టం అంచనాలపై సీఎం చంద్రబాబు సమీక్ష .. అధికారులపై ఆగ్రహం

Chandrababu

Chandrababu

AP CM Chandrababu: ఏపీలో వరద నష్టం అంచనాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేబినెట్ సబ్‌ కమిటీలోని మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఎన్యూమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై సీఎం ఆరా తీశారు. ఎన్యూమరేషన్ వివరాలను అధికారులు సమగ్రంగా అందివ్వలేకపోయారు. వివరాలు ఇవ్వలేకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు ఇబ్బందుల్లో ఉంటే వరద నష్టంపై ఎన్యూమరేషన్‌ను జాప్యం చేస్తారా..? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఎన్యూమరేషన్(వరద నష్టం అంచనా) చేసేందుకే ఇంత ఆలస్యమైతే నష్ట పరిహారం ఎప్పటికీ ఇవ్వగలమంటూ అధికారులను సీఎం చంద్రబాబు నిలదీసిన చంద్రబాబు. ఎన్యూమరేషన్ పూర్తైతేనే వరద నష్టం వివరాలు కేంద్రానికి ఇవ్వగలమనే విషయాన్ని గుర్తుంచుకుని పని చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రేపటిలోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Read Also: Kondapalli Srinivas: యువకులకు గుడ్ న్యూస్.. పారిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వ సాయం

Exit mobile version