NTV Telugu Site icon

CM Chandrababu: ఆర్ అండ్‌ బీ శాఖపై సీఎం సమీక్ష.. వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఆదేశాలు

Cbn

Cbn

CM Chandrababu: ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. రూ.861 కోట్లతో చేపట్టిన పాత్ హోల్ ఫ్రీ రోడ్ల నిర్మాణం సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు.. 1307 కిలోమీటర్ల పొడవైన 18 స్టేట్ హైవేలను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.. నరేగా నిధులతో గ్రామాల్లో 13 వేల కిలోమీటర్ల అంతర్గత రోడ్లు నిర్మాణం చేపట్టాలని.. పూర్తి నాణ్యతతో రోడ్ల మరమ్మతులు జరగాలని సీఎం సూచించారు.. అయితే, నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. ప్రైవేటు సంస్థల ద్వారా రోడ్ల నాణ్యతపై నివేదికలు తెప్పించాలని కీలక సూచనలు చేశారు..

Read Also: Israel-Hezbollah War: చల్లబడనున్న పశ్చిమాసియా.. యుద్ధంపై ఇరుపక్షాలు సంధి!

రాష్ట్రంలో మొత్తం 45,378 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రోడ్ నెట్ వర్క్ లో 22,299 వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, ఇప్పటి వరకు 1,991 కి.మీ మేర రోడ్లపై గుంతలు పూడ్చినట్లు సీఎంకు వివరించారు అధికారులు.. మరోవైపు 1,447 కి.మీ మేర రోడ్లు రిపేర్ చేయలేని స్థితిలో ఉన్నాయని.. వీటి స్థానంలో పూర్తిగా కొత్త రోడ్లు నిర్మించడానికి 581 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.. 23,521 కి.మీ లో జంగిల్ క్లియరెన్స్ కి 33 కోట్లు ఖర్చు అవుతుంది.. రాష్ట్రంలో మొత్తం 12,653 రాష్ట్ర హైవేలలో 10,200 కి.మీ మేర పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టవచ్చు.. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా పీపీపీ పద్ధతిలో రోడ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్దం చేయాలని తెలిపారు.. మొదటి ఫేజ్ కింద 18 రోడ్లును 1,307 కి.మీ మేర పిపిపి పద్దతిలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.. అయితే, డీపీఆర్‌ లు తయారు చేసి సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలన్న ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..