NTV Telugu Site icon

CM Chandrababu: మరో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్‌ రంగంలోని సంక్షోభం.. ఇలా వరుసగా ఇప్పటి వరకు మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మరో శ్వేత పత్రం విడుదల చేశారు. అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు.

Read Also: Minister Rama Naidu: ఆ గొప్ప వ్యక్తి ఆలోచనతో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం..

గత ప్రభుత్వ హయాంలో వీటన్నిటి పైనా దోపిడీ, ధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి శ్వేతపత్రంలో ప్రస్తావించారు. రికార్డుల్లో అన్ని దొరకలేదు. క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా తవ్వితే తప్ప ఈ దోపిడీ ఎంత జరిగిందో చెప్పలేమన్నారు. 2019-24 మధ్య పెద్ద ఎత్తున భూ కబ్జాల జరిగాయని.. విశాఖ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరుల్లో జరిగిన భూ దోపిడీలు ఒక ఉదాహరణ మాత్రమేనన్నారు.
ఇళ్ల పట్టాల పేరిట భారీ స్థాయిలో దోపిడీ జరిగిందన్నారు. అక్రమంగా పార్టీ కార్యాలయాల కోసం భూమి దోచేశారని.. అనర్హులైన వారికి భూ కేటాయింపు జరిగిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు.విశాఖలో రామానాయుడు స్టూడియోలో అనధికారికంగా ఇళ్ల పట్టాలివ్వడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ హయగ్రీవ పేరిట కోట్ల విలువైన భూమి కొట్టేశారన్నారు.

శ్వేతపత్రంలో.. “మాజీ ఎంపీ ఏంవీవీకి చెందిన కంపెనీలకు కోట్ల రూపాయలు భూములు ఇచ్చేసారు. ఒంగోలులో రూ. 101 కోట్ల రూపాయల ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లతో కాజేసారు. తిరుపతిలో మఠం భూములను 22 ఏలో పెట్టీ వైసీపీ వాళ్లు కొట్టేశారు విలువైన 70 ఎకరాల వరకూ భూమిని 22 ఏలో పెట్టి దోచేశారు. చిత్తూరులో 982 ఎకరాల భూమిని రైత్వారీ పట్టాల ద్వారా వైసీపీ నాయకులు కొట్టేశారు. పుంగనూరులో ఓ బడా నేత అధీనంలో రైత్వారీ పట్టాల ద్వారా కొట్టేశారు. ఇళ్ల పట్టాల ద్వారా 3 వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీల నుంచి 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం లాక్కున్నారు. ఆవ భూములు, అటవీ భూములు ఇళ్ల పట్టాల కోసం ఇచ్చి నివాస యోగ్యం కానీ చోట్ల ఇచ్చారు.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు.