NTV Telugu Site icon

CM Chandrababu: వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలి.. సీఎం ఆదేశాలు

Andhra Pradesh

Andhra Pradesh

CM Chandrababu: సైబర్ క్రైంలు, ఛీటింగ్‌లు జరగకుండా కంట్రోల్ చేయాలని.. రెండు టీంలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డొమెస్టిక్ నాలెడ్జి ఉన్న వారిని, ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని టీంలో ఉండేలా చూసుకోవాలన్నారు. వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారంలోగా కమిటీలు, యాక్షన్ ప్లాన్ కావాలన్నారు. రియల్ టైంలో యూజ్ కేసులు తయారు చేసి, సీసీ కెమెరాలపై కంట్రోల్ చేయాలన్నారు. సీసీ కెమెరాల డేటా విషయంలో కాస్ట్ అఫెక్టివ్‌గా ప్లాన్ సిద్దం చేయాలన్నారు. సీసీ టీవీ కెమెరాలు అన్నిచోట్లా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. రౌడీ షీటర్లు, క్రిమినల్స్ డేటా అంతా ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో లా అండ్ ఆర్డర్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీసీ టీవీల డేటా అనలైజ్ చేసి డ్రోన్‌లతో పని చేస్తారని.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో డ్రైవర్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవాలన్నారు. కలెక్టర్లు కూడా ఎస్పీలతో కలిసి క్రైమ్ కంట్రోల్‌లో కౌన్సిలింగ్ సెషన్స్‌లో వినియోగించాలన్నారు. జిల్లాలో త్రీ మెంబర్, ఫైవ్ మెంబర్ కమిటీలు వేయాలన్నారు. సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా సమర్ధవంతంగా పని చేయాలన్నారు. మనం అసమర్ధులం అయితే నేరస్థులు బలవంతులు అవుతారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: CM Chandrababu: మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి

సోషల్ మీడియాపై ప్రత్యేక కేబినెట్ సబ్‌ కమిటీ
ఐటీ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ లతో కలిపి సోషల్ మీడియాపై ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కేసులు, సైబర్ క్రైం కేసులపైన ఈ కమిటీ పూర్తిస్థాయి స్టడీ చేయనుంది. కొత్త తరహా నేరాలను ప్రత్యేకంగానే డీల్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంప్రదాయ నేరాలతో పాటు డిజిటల్ నేరాలను దర్యాప్తు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలీసుల్లోనే సాంకేతిక నిపుణులు ఉండాలి లేదా బయటనుంచి నిపుణుల్ని కూడా తీసుకుని విచారణ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్నవాటికంటే అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా వచ్చే డేటాను రియల్ టైమ్‌లో వినియోగించుకోవాలన్నారు. పోలీసింగ్ అనేది ప్రభావవంతంగా ఉండాలని వెల్లడించారు.

ముఖ్యమైన ప్రాంతాల్లో ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను కూడా పెట్టుకుని నేరస్థుల్ని గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్ల ద్వారానూ ర్యాండమ్ గా తనిఖీలు నిర్వహించాలని సీఎం సూచించారు. రహదారులపై కొన్ని హాట్ స్పాట్‌లలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. వాటిని కూడా విశ్లేషించి ప్రమాదాలు జరక్కుండానూ చర్యలు తీసుకునేలా ఆ డేటా ఉపయోగించాలన్నారు. కొన్ని కేసుల దర్యాప్తు విషయాలను బయటకు వెల్లడించటం ద్వారా ప్రజల్లోనూ అవగాహన పెంచాలన్నారు. సైబర్ క్రిమినల్స్‌కు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులూ కొత్త పరిజ్ఞానం ఉపయోగించాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా రియల్ టైమ్ నేరాలు, ప్రమాదాల నియంత్రణ జరుగుతోందని.. దాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నామన్నారు. నేరస్థులు రాజకీయ ముసుగులో బెదిరింపులకు దిగుతున్నారన్నారు.సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉందన్నారు. బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండపడ్డారు.

 

Show comments