NTV Telugu Site icon

CM Chandrababu: ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: గత ప్రభుత్వంలోని ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉచిత ఇసుక విధానం, తాగునీటి విషయాల్లో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలపై సీఐడీ ఎంక్వైరీ వేస్తామని వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం అమలులో జాగ్రత్తలు తీసుకోవాలని.. అక్రమాలు జరిగితే సహించనని సీఎం కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకున్న కలెక్టర్లను కాల్ బ్యాక్ చేస్తామన్నారు. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయని.. ఇసుక వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దన్నారు. ఇసుక సరఫరాలో పూర్తి పారదర్శకత పాటించాలని.. ఇసుక సరఫరాలో ప్రతి స్టెప్‌ను డిజిటలైజేషన్ చేస్తామన్నారు. ప్రకృతి అందించిన ఇసుకను ఇష్టం వచ్చినట్టు తవ్వేయడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు.

Read Also: CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. క్లాస్‌ తీసుకున్న సీఎం చంద్రబాబు..

ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో, తాగునీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రజలు ఇబ్బందులు పడతారని.. ఈ విషయంలో తాను ఉపేక్షించనన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయి.. గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని పరిస్ధితి గతంలో ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేసేస్తామని హెచ్చరించారు. ఇటీవల హంద్రీ నీవా కాల్వలకు నీటి విడుదల విషయంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించారని.. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి ఇన్ ఫ్లోస్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. అవసరమైతే డ్రోన్లు వాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ కలెక్టర్ల సదస్సులో జలవనరుల శాఖపై ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఇప్పడు అందుబాటులో ఉన్న నీటిని స్టోర్ చేసుకోవాలని సాయిప్రసాద్ సూచనలు చేశారు. అవసరమైతే మంత్రి నిమ్మలతో టచ్‌లో ఉండాలని కలెక్టర్లకు సాయిప్రసాద్ చెప్పారు. తమ శాఖలో మంత్రి సెక్రటరీలా.. సెక్రటరీ మంత్రిలా.. వ్యవరిస్తున్నారని సాయి ప్రసాద్ సరదాగా కామెంట్ చేశారు. సాయి ప్రసాద్ వ్యాఖ్యలపై నవ్వుతూనే సీఎం చంద్రబాబు స్పందించారు. కథలు చెపితే ప్రాబ్లెమ్స్ వస్తాయి అంటూ చంద్రబాబు చురకలు అంటించారు.