CM Chandrababu: బ్యాంకర్ల తో ఏర్పాటు చేసే సమావేశాల్లో రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు సీఎం చంద్రబాబు . రోటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 232వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది.. వ్యవసాయ, ప్రాథమిక రంగాలు, MSME, గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఖరీఫ్ లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని.. ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్ పుట్ ఇవ్వాల్సి ఉందన్నారు. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు సీఎం చంద్రబాబు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లూ తమ తీరు మార్చుకోవాల్సి ఉందన్నారు చంద్రబాబు.. జీఎస్టీలో సంస్కరణల్ని కేంద్రం తీసుకువచ్చిందని… నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు వచ్చేస్తున్నాయన్నారు సీఎం.. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించకూడదని.. తదుపరి సంస్కరణల దిశగా ప్రోత్సహించాలన్నారు.. అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాలు విసిరేలా మన ఆర్ధిక వ్యవస్థ తయారు అవుతోందని.. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలన్నారు..
Read Also: Shruti Haasan : ఆమె మీద ఇష్టం తోనే నాన్న ఆ పని చేశారు..
పేదలు- ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు అవసరమైన చర్యలనూ చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు.. ఆర్ధిక శాస్త్రం చదివిన విద్యార్ధిగా, ప్రజాప్రతినిధిగా పేదల గురించి నేను ఆలోచన చేస్తున్నా అన్నారు.. ఓ దశలో సంపద సృష్టి కోసం పరిశ్రమల కోసం దావోస్ లాంటి ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగానాని.. దేశంలో సంపద సృష్టి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు సమిష్టిగా పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు.. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎస్ హెచ్ జీ రంగాలకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. 231 ఎస్ఎల్ బీసీ లో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సమీక్ష చేశారు.. వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రపెన్యూర్ కార్యక్రమం, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై చర్చించారు.. ఎస్ఎల్ బీసీ సమావేశాలు రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సూచించారు.. 2047 నాటికి బలమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్ తయారవుతుందని వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Bollywood : మాస్ యాక్షన్ సినిమాలతో కొత్త రికార్డులు బ్రేక్ చేయబోతున్న మాస్ హీరో
ఇక, ఖరీఫ్ సీజన్‌లో రూ.1,80,540 కోట్ల రుణ లక్ష్యానికిగానూ జూన్ నాటికి రూ.94,666 కోట్ల మేర రుణాలను ఇచ్చాయి బ్యాంకులు.. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు రూ.985 కోట్ల రుణాల్ని మంజూరు చేశాయి.. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.49,831 కోట్ల రుణం మంజూరు అయ్యింది.. విద్యారంగానికి రూ.252 కోట్లు, హౌసింగ్ కు రూ.1,146 కోట్ల రుణాలు మంజూరు చేశాయి బ్యాంకులు.. పునరుద్పాదక ఇంధన రంగానికి రూ.125 కోట్ల మేర రుణ మంజూరు చేశారు బ్యాంకర్లు.. స్వయం సహాయ సంఘాలకు రూ.5,937 కోట్ల రుణాన్ని ఇచ్చాయి.. ముద్రా రుణాల కింద రూ.3189 కోట్లు మంజూరు చేశాయి..
