NTV Telugu Site icon

CM Chandrababu: పాలనలో మార్పు, మార్క్‌ చూపిస్తున్న చంద్రబాబు.. ఈ రోజు సీఎస్‌, డీజీపీలతో కీలక భేటీ

Cm Babu

Cm Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. పాలనలో తన మార్క్, మార్పు చూపిస్తున్నారు.. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన మార్క్ చూపిచేందుకు రెడీ అయ్యారు.. ఇవాళ సీఎంవో, సీఎస్, డీజీపీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి. సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుండగా.. అదే సమయంలో.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టనున్నారు ప్రభుత్వ పెద్దలు. ప్రవీణ్ ప్రకాష్, శశి భూషణ్, అజేయ్ జైన్, శ్రీలక్ష్మీ, గోపాల కృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.. ఇక, ఐదు హామీల అమలుపై ప్రణాళికతో, వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి.. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.. తాను ప్రకటించినట్టుగానే.. టీటీడీ ప్రక్షాళనతో పనిమొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి.. కొత్త ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు.. ఇక, అన్ని విభాగాల్లోనూ ఈ తరహా మార్పులు, చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.

Read Also: Gold Price Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై రూ.660 పెరిగింది!